మీ బ్లాగ్ కి ట్రాఫిక్ రాకపోవడానికి గల కారణాలు ఇవే

SEO in Telugu: ఒక బ్లాగ్ మొదలు పెట్టిన తరువాత ఎదురయ్యే పెద్ద సమస్య ఏదైనా ఉంది అంటే అది ట్రాఫిక్ మాత్రమే. నన్ను చాలా మంది ఇదే అడుగుతూ ఉంటారు, అన్న నేను బ్లాగ్ మొదలు పెట్టి 6 నేలను అయింది కానీ నాకు ట్రాఫిక్ రావడం లేదు అని.

అవును నేను బ్లాగింగ్ లోకి వచ్చిన మొదట్లో కూడా ఇలాగే ఉండేది. నేను ఎంత మంచి ఆర్టికల్ రాసిన కూడా నా సైట్ కి ట్రాఫిక్ వచ్చేది కాదు.

అప్పుడు నాకు సరిగా చెప్పేవాళ్ళు లేకపోవడం వాళ్ళ నాకు నేను చేసిన తప్పులు ఏంటి అనేవి ఆలస్యంగా తెలుసుకున్నాను. ఆ తరువాత ఆ తప్పులని సరి దిద్దుకున్న తరువాత నాకు ట్రాఫిక్ రావడం మొదలు అయింది.

అయితే ఈ రోజు నేను మీకు అసలు ఆ తప్పులు ఏంటి వాటిని ఎలా సరి దిద్దుకోవాలి అనేది చెప్తాను.

Not Optimizing for the right keywords

చాలా మంది Beginners అస్సలు keyword research చెయ్యరు. ఒకవేళ మీరు కూడా అందులో ఒకరు అయితే, మంచి keywords నీ ఎలా వేతకలో తెలుసుకోండి.

మనం రాసె ప్రతి పోస్ట్ వెనుకాల మనం తప్పక కీవర్డ్ రీసెర్చ్ చెయ్యాలి, కీవర్డ్ రీసెర్చ్ చెయ్యకుండా రాసిన ఆర్టికల్ చీకట్లో వదిలిన బాణం లాంటిది. ఒకవేళ మన అదృష్టం బాగుంటే rank అవ్వచ్చు లేదంటే కాకపోవచ్చు.

కానీ కీవర్డ్ రీసెర్చ్ చేసి రాసిన ఆర్టికల్ గురిచూసి వదిలిన బాణం లాంటిది, దీనికి తగిలే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకనే మీరు ఎప్పుడు కూడా కీవర్డ్ రీసెర్చ్ చెయ్యకుండా ఆర్టికల్స్ ని రాయకండి.

కీవర్డ్ రీసెర్చ్ ఎలా చెయ్యాలి?

కీవర్డ్ రీసెర్చ్ చెయ్యడానికి ఇంటర్నెట్ లో చాలా టూల్స్ అందుబాటులో ఉన్నాయా అందులో కొన్ని ముఖ్యమైనవి :

Google Keyword Planner

దీన్ని ఉపయోగించి మీరు ఫ్రీగానే keyword research చెయ్యవచ్చు. ముందు గూగుల్ కీవర్డ్ ప్లానర్ వెబ్సైటు లోకి వెళ్లి Discover New Keywords పైన క్లిక్ చేసి మీ కీవర్డ్ ని ఎంటర్ చేయండి.

అప్పుడు మీకు ఆ keyword కి సంబందించిన ఇతర keywords రావడం జరుగుతుంది . అందులో నుండి ఎక్కువ Monthly Searches తక్కువ Competition ఉన్న కీవర్డ్స్ ని ఎంచుకొండి.

ఇప్పుడు అదే కీవర్డ్ ని గూగుల్ లో వెతకండి. అప్పుడు మీకు About X,XX,XXX search results అని వస్తుంది, ఇలా మీరు ఒక 10 keywords ని search చేసి దేనికైతే తక్కువ search results వస్తాయో. ఆ కీవర్డ్ ని ఎంచుకోండి,

గమనిక: మీరు ఎంచుకున్న కీవర్డ్స్ కి TOP 10 results లో ఎక్కువ డొమైన్ రేటింగ్ ఉన్న సైట్స్ ఉంటె మాత్రం మీరు ఆ కీవర్డ్ ని వదిలేసి వేరే మంచి కీవర్డ్ వెతుకోవడం మంచింది.

వెబ్సైటు యొక్క డొమైన్ రేటింగ్ చూడడానికి మీరు Ahrefs కి సంబందించిన ఫ్రీ Website “Authority” Checker ని ఉపయోగించుకోండి.

Low Value / Useless Content

Keyword research చేసాక మన బ్లాగ్ లో ఆ keywords ని వాడి content ని రాయాలి. కానీ చాలా మంది beginners content ని తక్కువగా రాస్తారు. మీరు ఎంత ఎక్కువ కంటెంట్ రాస్తే మీ సైట్ అంత ఎక్కువ ర్యాంక్ అవ్వడానికి chances ఉంటాయి. అందుకని సాధ్యమైనంత వరకు ఎక్కువ content ఉండేలా చూసుకోండి. ఆలా అని ఏదో ఒక పెంట రాయకుండా మంచి కంటెంట్ మాత్రమే రాయండి

గమనిక: ఎక్కువ కంటెంట్ కంటే క్వాలిటీ కంటెంట్ ముఖ్యం.

అలాగే కంటెంట్ రాసేటప్పుడు On-Page SEO ని దృష్టిలో పెట్టుకొని రాయండి.

Backlinks ని పట్టించుకోకపోవడం.

నాకు తెలుసు చాలా మంది beginners, backlinks ని అస్సలు పట్టించుకోరు. కానీ మీ సైట్ search results లో పైన రావడానికి backlinks కుడా ఎంతో ముఖ్యం. కాబట్టి మీరు మీ బ్లాగ్ కి మంచి backlinks ని వేసుకోండి. అలాగే మీ సైట్ కి ఉన్న spam మరియు broken links ని తీసివేసుకోండి. దీని కోసం మీకు Semrush ఎంతో ఉపయోగపడుతుంది.

గమనిక: ఏదైనా ఒక సైట్ backlinks ని చెక్ చెయ్యడం కోసం Ahrefs కి సంబంధించిన ఫ్రీ Backlink Checker ని వాడుకోవచ్చు.

ఈ పైన చెప్పిన 3 మిస్టేక్స్ నీ కనుక మీరు చెయ్యకుండా ఉన్నట్టయితే మీ niche లో ఉన్న ఇతర బ్లాగ్స్ తో పోలిస్తే 99% ముందుంటుంది.

మీలో చాలా మందికి ఇవ్వి సింపుల్ గా అనిపించవచ్చు కానీ మీరు వీటిని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే మీకు సక్సెస్ వస్తుంది.

Kiran Samileti

About the author

My Name is Kiran, I am doing an IT job full-time and doing Blogging, Youtuber, and affiliate Marketing part-time to make my ways to build passive income streams.