How to Earn Money From Home in Telugu

హాయ్ ఫ్రెండ్స్,

మనలో చాలా మందికి ఏదైనా ఒక పార్ట్ టైం జాబ్ చేసి ఇంకా కొంచం ఎక్కువ డబ్బులు సంపాదించి కుటుంబానికి సహాయపడాలని ఉంటుంది. కానీ మన ఇండియా లో పెరుగుతున్న జనాభాకి తగ్గ విధంగా జాబ్ అవకాశాలు పెరగడం లేదు. ఒకవేల ఏదైనా ఒక పార్ట్ టైం జాబ్ దొరికిన అది మన స్టేటస్ కి సరిపోదని లేదా ఇంకా ఏ ఇతర కారణాల వలనో మనం ఆ జాబ్ చెయ్యడానికి ఇష్టపడట్లేదు.

అందుకే చాలా మంది ఇంట్లో ఉంటూనే పని చెయ్యగలిగే ఏదైనా ఒక పార్ట్ టైం జాబ్ ఉంటె బాగుంటుంది అని అనుకుంటారు. అందులో మీరు కూడా ఒకరా?

అయితే, ఈ ఆర్టికల్ మీకోసమే, ఈ ఆర్టికల్ ద్వారా నేను మీకు ఇంట్లో ఉంటూనే పని చేసి డబ్బులు సంపాదించునే కొన్ని మంచి అవకాశాల గురించి చెప్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం పదండి అవేంటో చూసేదం.

గమనిక: చాలా మంది ఆన్లైన్ లో పార్ట్ టైం జాబ్ లేదా వర్క్ ఫ్రొం హోమ్ జాబ్ అనగానే Data Entry జాబ్, captcha జాబ్, బుక్ రైటింగ్ జాబ్ అని అనుకుంటారు. కానీ నిజానికి అలాటి జాబ్స్ ఉండవు, ఒకవేళ ఎవరైనా అలంటి జాబ్ ఇష్టం అని డబ్బులు అడుగుతే జాగ్రత్త వహించగలరు .

ఆన్లైన్ టీచింగ్?

COVID వల్ల చాలా మంది ప్రజలు ఆన్లైన్ విధానానికి చాలా అలవాటుపడిపోయారు. కాబట్టి మీరు మీకున్న ఏదైనా ఒక స్కిల్ ని ఇతరులకు ఆన్లైన్ ద్వారా నేర్పించి డబ్బులు సంపాదించవచ్చు.

ఉదాహరణకి – మీకు గీటర్ వాయుచడం వచ్చినట్టయితే, మీరు గీటర్ నేర్చుకోవాలి అనుకునే వారికి ఆన్లైన్ ద్వారా తరగతులు తీసుకోవచ్చు.

అయితే మరి స్టూడెంట్స్ ని ఎలా పొందాలి?

దీని కోసం మొదటగా మీ సోషల్ మీడియా లో మీరు గిటార్ నేర్పించాలి అని అనుకుంటున్నాను, ఆసక్తి ఉన్నవారు పాలనా టైం కి ఫ్రీ గానే మీ వెబినార్ లేదా ఆన్లైన్ క్లాస్ కి అటెండ్ అవ్వమని చెప్పండి.

ఈ ఫ్రీ క్లాస్ లో మీరు మీకున్న అనుభవాన్ని, గిటార్ వాయించడం వాళ్ళ కలిగే ఉపయోగాల్ని, అలాగే కొన్ని బేసిక్స్ ని వాళ్లకు నేర్పించి, చివరలో మీరు కండక్ట్ చేసే ఫుల్ ట్రైనింగ్ గురించిన విషయాలను తెలియజెయ్యండి. ఇలా చెయ్యడం ద్వారా మీ ఫ్రీ క్లాస్ కి వచ్చిన వాళ్లలో కొందరు మీ ఫుల్ టైం ట్రైనింగ్ క్లాసులకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ్.

ఇలా మీరు వారానికి 2 రోజులు ఫ్రీ క్లాసులు పెడుతూ కొత్త విద్యార్థులను సంపాదించు కోవచ్చు.

పై ఉదాహరణలో చెప్పిన విధంగా మీకు వచ్చిన ఏ స్కిల్ ని ఆయన సరే ఇతరులకి నేర్పించి డబ్బులు సంపాదించవచ్చు.

యూట్యూబ్ ఛానల్

మీలో చాలామంది యూట్యూబ్ ని వాడేఉంటారు, కానీ మీకు తెలుసా? మనం యూట్యూబ్ ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఈ విషయం కూడా మీలో కొంత మందికి తెలిసే ఉంటుంది కానీ ఏం వీడియోస్ పెట్టాలి, ఇప్పుడు పెడితే డబ్బులు ఎప్పుడు వస్తాయి అనే వివిధ కారణాల వలన మొదలు పెట్టకపోవచ్చు.

కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు యూట్యూబ్ ద్వారా లక్షల్లో సంపాదిస్తున్న ప్రతి ఒక్కరు ఒకప్పుడు ఇలాగె అలోచించి మొదలు పెట్టి ఉండకపోతే వాళ్ళు ఈరోజు ఉన్న స్థాయిలో ఉండరు. కాబట్టి మీ ఎలాటి చెడు ఆలోచన లేకుండా మీకు ఇంటరెస్ట్ ఉన్న టాపిక్ పైన వీడియోస్ పెడుతూ ఉండండి. వెంటనే success కాకపోయినా ఏదైనా ఒకరోజు మీరు పక్కాగా సక్సెస్ అవుతారు .

కొన్ని సార్లు మీరు యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించపోయిన పరోక్షంగా డబ్బులు సంపాదించవచ్చు. ఉదాహరణకి నా యూట్యూబ్ ఛానల్ ని చూసుకుంటే నాకు నా ఛానల్ ద్వారా వచ్చే మనీ చాలా చాలా తక్కువ ఐన కూడా నాకు నా వీడియోస్ చుసిన వాళ్లలో కొందరు నాకు మెసేజ్ చేసి వాళ్ళ వెబ్సైటు ని డిజైన్ చెయ్యమని అడుగుతారు ఆలా చేసినందుకు గాను నేను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాను.

ఇలా మీరు కూడా మీకున్న స్కిల్ ని యూట్యూబ్ ద్వారా ప్రమోట్ చేసుకొని పరోక్షంగా డబ్బులు సంపాదించుకోవచ్చు.

సోషల్ మీడియా Influencer

మీరు కూడా సోషల్ మీడియా influencer గా మారి డబ్బులు సంపాదించవచ్చు, కానీ దీనికి మీకు ఏదైనా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫారం లో మంచి ఫాల్లోవెర్ కౌంట్ ఉండాలి. మీరు రోజు ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ లలో చాల మంది influencers వీడియోస్ చూసేఉంటారు మీరు కూడా ఆలా ఒక మంచి కంటెంట్ పైన వీడియోస్ చేస్తూ ఫాలోయర్స్ ని సంపాదించుకొని, మీ కంటెంట్ కి రిలేటెడ్ గా ఉన్న బ్రాండ్స్ తో collaborate అయి మనీ సంపాదించుకోవచ్చు.

కానీ ఈ విధంగా సంపాదించాలి అంటే మీకు కొంచం ఎక్కువ సమయం పట్టవచ్చు, అందుకనే దీన్ని మీరు మరొక ఆప్షన్ గా పెట్టుకొని దీని పైన కూడా consistent గ పని చెయ్యండి.

బ్లాగింగ్

మీకు తెలుసా పై వాటన్నిటితో పోలిస్తే బ్లాగింగ్ ద్వారా చాల ఎక్కువ మొత్తం లో డబ్బులు సంపాదించవచ్చు.

Also Read: 2021 లో నేను ఆన్లైన్ ద్వారా ఎంత సంపాదించాను?ఎలా సంపాదించాను?

అయితే మీకు అసలు ఈ బ్లాగింగ్ అంటే ఏంటి? బ్లాగింగ్ చెయ్యడం ద్వారా డబ్బులు ఎలా వస్తాయి అని తెలియకపోతే, ఈ ఆర్టికల్ ని చదవండి అలాగే కింద ఉన్న యూట్యూబ్ వీడియోస్ ని చూసి తెలుసుకోండి.

బ్లాగింగ్ చెయ్యాలి అంటే మీకు కొంచం కంప్యూటర్ knowledge అలాగే కొంచం ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది.

మొదటగా మీరు బ్లాగ్ ని స్టార్ట్ చేసే ముందు మీరు ఆ బ్లాగ్ లో ఏం పెట్టాలి అనుకుంటున్నారు, జనాలు ఎక్కువగా వేటి గురించి వెతుకుతున్నారు అని research చెయ్యాలి.

ఆ తరువాత ఆ టాపిక్ కి తగ్గ విధంగా ఒక డొమైన్ name & Hosting ని తీసుకొని ఒక బ్లాగ్ ని స్టార్ట్ చెయ్యచ్చు. బ్లాగింగ్ పైన మీకు ఎలాంటి సందేహాలు ఉన్న మీరు నా యూట్యూబ్ ఛానల్ లోకి వెళ్లి నేర్చుకోవచ్చు.

Kiran Samileti

About the author

My Name is Kiran, I am doing an IT job full-time and doing Blogging, Youtuber, and affiliate Marketing part-time to make my ways to build passive income streams.

4 thoughts on “How to Earn Money From Home in Telugu”

Leave a Comment