Blogger vs WordPress – ఏది మంచిది?

బ్లాగింగ్ చెయ్యడానికి ఆన్లైన్ లో చాలా ప్లాటుఫార్మ్స్ ఉన్నపటికీ ముఖ్యం గా Blogger & WordPress ప్రాచుర్యం లో ఉన్నాయి. కాబట్టి చాలా మందికి ఈ రెండిట్లో ఏది ఎంచుకోవాలి అనే ఒక డౌట్ ఉంటుంది.

నేను 2019 లో బ్లాగింగ్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఇదే డౌట్ ఉండేది. బ్లాగర్ బాగుంటాదా లేక wordpress బాగుంటాదా అని. అప్పుడు రీసెర్చ్ చేసిన తరువాత నాకు wordpress అయితే బాగుంటుంది అని తెలిసింది.

కానీ WordPress లో బ్లాగ్ స్టార్ట్ చెయ్యాలి అంటే hosting కావాలి, hosting కావాలి అంటే డబ్బులు కావాలి. అప్పుడు నేను student అవ్వడం వల్ల నాదగ్గర hosting కొనే అంత డబ్బులు లేవు. కాబట్టి నా మొదటి బ్లాగ్ ని blogspot లోనే స్టార్ట్ చేశాను.

నేను స్టార్ట్ చేసి 6 నెలలు అయిన కూడా నాకు ట్రాఫిక్ వచ్చేది కాదు. దానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ అందులో ఒకటి నేను బ్లాగర్ ని వాడడం వల్లే అని తెలుసుకున్నాను. ఎందుకంటే బ్లాగర్ లో మనకు అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు.

కాబట్టి, ఈసారి నేను హోస్టింగ్ తీసుకున్న తరువాత బ్లాగింగ్ చేద్దాం అని డిసైడ్ అయిన తరువాత, నా pocket మనీ తో ₹3000 పెట్టి ఒక హోస్టింగ్ తీసుకొని నా సెకండ్ బ్లాగ్ నీ స్టార్ట్ చేసాను.

అలా స్టార్ట్ చేసిన తరువాత ఒక 3 నెలలకు నాకు AdSense approval వచ్చింది, ఆ తరువాత నాకు మెల్లి మెల్లిగా ట్రాఫిక్ రావడం మొదలైంది. అప్పుడు నాకు అర్ధం అయింది నేను wordpress లోకి వచ్చి మంచి పని చేశాను అని.

అలా ఆ తరువాత రెండు నెలలకు నా బ్లాగ్ నుండి ఫస్ట్ పేమెంట్ వచ్చింది. అలా మొదలైన నా ప్రయాణం ఇప్పుడు నెలకు ₹50,000 నుండి ₹ 80,000 సంపాదించే వరకు వచ్చింది.

నా Google AdSense Earning చూడండి.

బ్లాగింగ్ అంటే కూడా ఒక చిన్న బిజినెస్ లాంటిదే, ముందు మనం ఎంతో కొంత invest చేస్తే కానీ మనం అందులో త్వరగా సక్సెస్ కాలేము.

కాబట్టి మీరు ఇప్పటికి బ్లాగర్ వాడుతుండి WordPress లోకి రావాలా వద్ద అని సందేహం లో ఉంటే మాత్రం. నేను మీకు ఇచ్చే ఒకే ఒక సలహా WordPress లోకి షిఫ్ట్ అవ్వండి.

ఎందుకంటే మనకు WordPress లో చాలా మంచి థీమ్స్, మరియు plugins అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు ఏం అయిన చెయ్యాలి అనుకున్న చాలా సులువుగా చెయ్యవచ్చు.

అదే విధంగా rank math వంటి SEO plugins నీ వాడి, మీ బ్లాగ్ నీ మరింత ముందరికి తీసుకు వెళ్ళవచ్చు.

WordPress లో బ్లాగ్ చెయ్యాలి అంటే ఎంత ఖర్చు అవ్తాయి?

WordPress లో బ్లాగ్ మొదలు పెట్టాలి అనుకుంటే మొదటగా మీకు కావల్సింది ఒక డొమైన్ నేమ్ & హోస్టింగ్.

అయితే hostinger వాళ్ళు మనకి హోస్టింగ్ కొన్నందుకు ఒక డొమైన్ నేమ్ నీ free గా ఇవ్వడం జరుగుతుంది.

కాబట్టి మీరు అతి తక్కువ ఖర్చులో ఒక డొమైన్ నేమ్ & హోస్టింగ్ నీ తీసుకొని, మీ బ్లాగ్ నీ మొదలు పెట్టవచ్చు.

Web Hosting Deals

BlueHost

Officially Suggested by WordPress.org
₹399/m
₹175.00/month
Save ₹2688/year

Hostinger Special Deal

The cheap and best hosting for beginners
₹299/m
now ₹79.00/month
Save ₹2640/year(74% OFF)

Namecheap

Save 21% on domain, hosting, SSL, Private Email, and premium DNS renewals on Name Cheap 21st birthday sale
$ 2.88/m
now $ 1.58/month
Save 45% on 1st Year
Kiran Samileti

About the author

My Name is Kiran, I am doing an IT job full-time and doing Blogging, Youtuber, and affiliate Marketing part-time to make my ways to build passive income streams.