How to Start A Blog Using WordPress in Telugu

మీరు నా పాత article కనుక చదివినట్లయితే మీకు బ్లాగింగ్ అంటే ఏంటి మరియు బ్లాగింగ్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించవచ్చని మీకు అర్థమైపోయి ఉంటుంది.

అయితే మీరు ఇప్పుడు నన్ను అయితే మీరు కూడా బ్లాగింగ్ చేదాం అనుకుంటే మొదట మీకు కావాల్సింది ఒక బ్లాగ్.

కాబట్టి ఈ article ద్వారా నేను మీకు WordPress లో ఒక బ్లాగ్ ని ఎలా మొదలు పెట్టాలో నేర్పిస్తాను.

మీరు ఒక blog ని స్టార్ట్ చేసే ముందు ఈ కింద చెప్పిన పాయింట్స్ ని దృష్టిలో పెట్టుకోండి.

Select Your Niche

నీచ్ అంటే మీ బ్లాక్ లో ఉండే content type, ముందుగా బ్లాగ్ ని మొదలు పెట్టే ముందు మీరు అందులో దేని గురించి రాయాలి అనుకుంటున్నారు అనేది నిర్ణయించుకోండి ఎందుకంటే మీ blog లో మీరు ఏం రాయాలి అనుకుంటున్నారో వాటిపైన మీకంటూ ఒక అవగాహనా ఉండాలి.

మీరు ఏం రాద్దాం అనుకుంటున్నారో మీకే అర్థం కాకపోతే మీరు బ్లాగ్ ని స్టార్ట్ చేసి కూడా ప్రయోజనం ఉండదు.

90 శాతం మంది బ్లాగర్స్ వాళ్ళు ఏం రాయాలి అనుకుంటున్నారో తెలియక ఏదో ఒకటి రాసి సక్సెస్ కాలేకపోతున్నారు.

అందుకే మీరు బ్లాగ్ ని స్టార్ట్ చేసే ముందు మీరు ఏం రాయాలి అనుకుంటున్నారో ఒక నిర్ణయానికి రండి.

ఒకవేళ మీరు ఎలాంటి టాపిక్ ని పెంచుకోవాలో నిర్ణయించుకోలేక పోతున్నట్టు అయితే మీకు దేని పైన అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో అలాగే ఎక్కువ నాలెడ్జ్ ఉందో ఆ టాపిక్ ని ఎంచుకోండి.

అలాగే మీరు ఎంచుకున్న టాపిక్ జనాలకి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒకసారి మీలో మీరు ఆలోచించండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా జనాలు దానిని చదవటానికి ఇష్టపడకపోతే మీరు రాసి కూడా వృధా అవుతుంది.

దీని గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ఇక్కడ Click చెయ్యండి

Select Your Domain name

ఇప్పుడు మీరు ఒక టాపిక్ ని ఎంచుకున్న తర్వాత మీరు ఆ ఆ టాపిక్ కి తగ్గ విధంగా ఒక డొమైన్ నేమ్ ని ఎంచుకోవాలి.
మీ డొమైన్ నేమ్ ని ఎంచుకోవడంలో మీరు ఎక్కువ ఆలోచించాల్సిన పని కూడా లేదు కేవలం కింద ఇచ్చిన కొన్ని పాయింట్స్ ని దృష్టిలో పెట్టుకుంటే చాలు.

  • మీ డొమైన్ నేమ్ చిన్నగా ఉండేలా చూసుకోండి.
  • మీ డొమైన్ నేమ్ మీ టాపిక్ కి తగ్గే విధంగా ఉండాలి.
  • మీ డొమైన్ నేమ్ లో నంబర్స్ & – లేకుండా ఉండాలి.
  • మీరు ఎంచుకున్న పేరు ఇతరులకు సులువుగా గుర్తు పెట్టుకునే విధంగా ఉండాలి.

అంతే ఇలా మీరు ఒక డొమైన్ నేమ్ ని ఏదైనా ఒక వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకుని అవైలబుల్ గా ఉంటే కొనుక్కొని పెట్టుకోండి. ఒకవేళ మీరు అనుకున్న పేరు అవైలబుల్ గా లేకపోతే డాట్ ఇన్ డాట్ నెట్ డాట్ ఉన్నాయో చూసి వాటిలో ఒకటి కొనుక్కోండి.

Choose a Good Blogging Platform

నేను మొదట్లో బ్లాగింగ్ ప్రారంభించడానికి నేను ఉచిత బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ (blogger) ను ఉపయోగించాను. ఇది ఉపయోగించడానికి సులభం, కానీ చాలా ఉచిత బ్లాగింగ్ platform లు మీ website పై 100% పూర్తి నియంత్రణను మీకు ఇవ్వవు. మీరు వారి నిబంధనలు లేదా షరతులను ఉల్లంఘిస్తే, మీకు తెలియజేయకుండానే మీ బ్లాగును తొలగించడానికి వారికి అన్ని హక్కులు ఉంటాయి.

నేను blogger తో మొదలు పెట్టాను కదా అని మీరు కూడా బ్లాగర్ తో మొదలుపెట్టాలి అనుకోకండి.

తెలివైన వ్యక్తి తన తప్పుల నుండి నేర్చుకుంటాడు కాని జ్ఞానీ ఇతరుల తప్పుల నుండి నేర్చుకుంటాడు.

కాబట్టి మీకు నిజం గా బ్లాగింగ్ పై ఇంటరెస్ట్ ఉండి మీ బ్లాగ్ ని విజయవంతం చేసి దాని ద్వారా సంపాదించాలి అనుకుంటే మీ బ్లాగ్ ని WordPress తో మొదలుపెట్టండి.

WordPress వాళ్ళ కలిగే ప్రయోజనాలు :

  • మీ సైట్ పై పూర్తి నియంత్రణ
  • SEO ఫ్రెండ్లీ
  • చాలా ప్లగిన్స్ మరియు థీమ్‌లు అందుబాటులో ఉన్నాయి
  • మీకు కావలసినట్టు బ్లాగ్ కి మార్చుకోవచ్చు
  • వర్డుప్రెస్సు ని మోనేటిజ్ చెయ్యడం సులభం.

మీ స్వంత wordpress బ్లాగును ప్రారంభించడానికి ఎం కావలి ?

మీరు self hosted WordPress బ్లాగ్ ని స్టార్ట్ చేయాలి అంటే మీకు పోస్టింగ్ తప్పక కావాలి.

ఒకవేళ మీరు తక్కువ ఖర్చులో ఉండే మంచి హోస్టింగ్ గురించి చూస్తున్నటైతే నేను మీకు bluehost వాడమని రికమెండ్ చేస్తాను. నేను గత 2 సంవత్సరాల నుండి bluehost నే వాడుతున్నాను ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు రాలేవు.

కాబట్టి, నేను మీకు Bluehost ని suggest చేస్తున్నాను.

మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే వివరాల్లోకి వెళ్దాం.

BlueHost Plans

Basic

₹199/month

1 Website

Free SSL Certificate

Free Domain

25 Sub Domains

Automatic Daily Malware Scan

24/7 Supporttaciti

most popular

CHOICE PLUS

₹199/MONTH

Unlimited Websites

Free SSL Certificate

Free Domain

Unlimited Sub Domains

Automatic Daily Malware Scan

24/7 Support

Free Domain Privacy

Free Daily Website Backup

PRO

$299 month

Unlimited Websites

Free SSL Certificate

Free Domain

Automatic Daily Malware Scan

Free Domain Privacy

Dedicated IP

Step 1: ఇప్పుడు మీరు కింద ఫోటో లో చూపిస్తున్న విధంగా Learn More పైన క్లిక్ చేయండి.

shared hosting
shared hosting

Step 2: ఆ తరువాత మీరు మీ బడ్జెట్ ని అండ్ వెబ్సైట్ ని బట్టి మీరు మీకు తగ్గ ప్లాన్ ని ఎంచుకోండి.

choose plan

Step 3: ఎప్పుడు మీకు ఒక డొమైన్ నామ ఫ్రీ గ వస్తుంది దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి

మీకు కావాల్సిన డొమైన్ నేం ని ఎంటర్ చెయ్యండి.

Step 4: మీ పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్, మెయిల్ ID fill చెయ్యండి

అలాగే మీరు ఎన్ని నెలలకు hosting ని తీసుకోవాలి అనుకుంటున్నారో ఎంచుకొని, Extra Packages ని తీసివేయండి.

ఇప్పుడు payment చెయ్యడం కోసం submit బటన్ పైన క్లిక్ చెయ్యండి.

ఆ తరువాత మీకు ఇలాంటి page open అవుతుంది, ఇక్కడ మీరు Google Pay తో గని, లేదా ఇతర ఏ UPI అప్స్ ద్వారా ఐన మీరు పేమెంట్ ని పూర్తిచెయ్యవచ్చు.

మీరు పేమెంట్ కంప్ల్ట్ చేసిన తరువాత, మీకు Create అకౌంట్ అని వస్తుంది దానిపైన క్లిక్ చేసి ఒక password ని సెట్ చేసుకోండి.

ఆ తరువాత మీ మెయిల్ ID & పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.

ఆ తరువాత కింద చూపించిన విధంగా Create Your Website పైన క్లిక్ చెయ్యండి.

ఇప్పుడు Continue పైన క్లిక్ చెయ్యండి

ఆ తరువాత No Help Needed పైన క్లిక్ చెయ్యండి

ఇక్కడ blog అని సెలెక్ట్ చేసుకోండి

ఇప్పుడు కింద చూపించిన విధంగా Get Started పైన క్లిక్ చెయ్యండి

ఇక్కడ మీ బ్లాగ్ type ని ఎంచుకొని continue చెయ్యండి

ఇప్పుడు మీ website name & tagline ని ఇవ్వండి

ఇప్పుడు మీకు నచ్చిన ఏదైనా ఒక theme ని ఎంచుకోండి

అంతే ఇప్పుడు మీ సైట్ Ready అయిపోయింది, ఇప్పుడు మీ సైట్ ని మేనేజ్ చెయ్యడానికి Manage Site పైన క్లిక్ చెయ్యండి

ఆ తరువాత Log in to WordPress పైన క్లిక్ చేస్తే, మీ website WordPress Dashboard ఓపెన్ అవుతుంది

ఇప్పుడు మీరు మీ వెబ్సైటు లో ఏం చెయ్యాలి అనుకున్న ఈ Dashboard ద్వారానే చెయ్యవలసి ఉంటుంది.

మీకు ఇంకా ఈజీ గ అర్ధం కావడానికి నేను step by step videos ని కూడా నా YouTube ఛానల్ లో upload చెయ్యడం జరిగింది. వాటిని చూసి చాల సులువుగా మీ website ని డిజైన్ చేసుకోవచ్చు

Kiran Samileti

About the author

My Name is Kiran, I am doing an IT job full-time and doing Blogging, Youtuber, and affiliate Marketing part-time to make my ways to build passive income streams.