2021 లో నేను ఆన్లైన్ ద్వారా ఎంత సంపాదించాను?ఎలా సంపాదించాను?

నమస్తే, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ఈ రోజు నేను మీతో, 2021 లో నేను ఆన్లైన్ ద్వారా ఎంత సంపాదించాను, ఎలా సంపాదించాను అనే విషయాలను మీతో పంచుకుంటాను.
నేను 2021 లో ఆన్లైన్ ద్వారా సంపాదించినా మొత్తం అమౌంట్ దాదాపు 8 లక్షలు, అంటే ఇది నా ఫుల్ టైం జాబ్ తో పోలిస్తే 2 రేట్లు ఎక్కువ.

Note: I know ఇది చాలా చిన్న అమౌంట్. దీనికంటే 10 రేట్లు, లేదా 100 రేట్లు ఎక్కువ సంపాదిస్తున్న బ్లాగర్స్ కూడా మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నారు.

ముందుగా నా మొదటి income source, Google Adsense.

నాకు ముఖ్యంగా 2 Adsense accounts ఉన్నాయి, వాటి ద్వారా 2021 మొత్తం లో నాకు వచ్చిన అమౌంట్ ₹7,07,151 రూపాయలు.

Affiliate Income

అలాగే affiliate program ద్వారా వచ్చిన అమౌంట్ మొత్తం సరిగ్గా 1 లక్ష రూపాయలు.

అయితే నేను ఆన్లైన్ లో చేసే పని ఏంటి?

నేను ఆన్లైన్ లో చేసే పని బ్లాగింగ్, మీరు కూడా నాలాగా బ్లాగింగ్ చేస్తూ ఆన్లైన్ ద్వారా డబ్బులు సంపాదించాలి అనుకుంటే నేను మీకు help చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాను.

అసలు బ్లాగింగ్ అంటే ఏంటి ?

బ్లాగ్ లేదా వెబ్సైటు ద్వారా ఇతరులకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని అందించడం. ఉదాహరణకు ఒకతను 10,000 రూపాయల లోపు ఉండే బెస్ట్ మొబైల్స్ గురించి సెర్చ్ చేస్తుట్లైతే మనం మన బ్లాగ్ ద్వారా 10,000 రూపాయల లోపు ఉండే బెస్ట్ మొబైల్స్ ని అతనికి తెలియజేయడం.

అలా ఇతరులకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా మనకు ఏం ఉపయోగం అని మీరు అనుకోవచ్చు.

మనం అలా ఇతరులకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందిస్తూనే మనం మన బ్లాగ్ లో యాడ్స్ ని పెట్టుకోవచ్చు, ఇప్పుడు మనం అందించే ఇన్ఫర్మేషన్ కోసం వచ్చిన యూసర్ ఆ యాడ్స్ ని చూసినప్పుడు, అలాగే వాటిపైన క్లిక్ చేసినందుకుగాను మనకు డబ్బులు వస్తాయి.

ఇప్పుడు మీకు బ్లాగింగ్ అంటే ఏంటి, బ్లాగింగ్ ద్వారా డబ్బులు ఎలా వస్తాయి అని మీకు అర్ధం అయింది అనుకుంటున్నాను.

How to Start a Blog

అయితే ఇప్పుడు మనం ఒక బ్లాగ్ ని ఎలా మొదలు పెట్టాలి అని తెలుసుకుందాం,

ముందుగా మీరు ఒక బ్లాగ్ ని మొదలు పెట్టె ముందు మీరు అసలు ఆ బ్లాగ్ లో ఏం పెట్టాలి అనుకుంటున్నారో డిసైడ్ అవ్వండి.

ఉదాహరణకు మీకు టెక్నాలజీ పైన మంచి ఇంటరెస్ట్ & గ్రిప్ ఉంటె మీరు టెక్నాలజీ కి సంబంధించిన బ్లాగ్ ని మొదలుపెట్టచ్చు

Note : మీరు ఫైనాన్స్ గురించి పెట్టాలి అనుకుంటే మీరు ఆ బ్లాగ్ లో కేవలం ఫైనాన్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే పెట్టాలి అంతేకాని నాకు టెక్నాలజీ పైన కూడా ఇంటరెస్ట్ ఉంది కదా అని దాన్ని కూడా ఫైనాన్స్ కి సంబంధించిన బ్లాగ్ లో పెట్టడం మంచి పద్ధతి కాదు. ఒకవేళ మీకు 2 టాపిక్స్ పైన ఇంటరెస్ట్ ఉంది రెండింటి పైన బ్లాగింగ్ చెయ్యాలి అనుకుంటే మీరు దానికోసం ఒక సెపెరేట్ బ్లాగ్ క్రియేట్ చెయ్యడం మంచింది.

మీరు మీ బ్లాగ్ లో ఎం పెట్టాలి అని డిసైడ్ అయ్యాక తరువాత చెయ్యాల్సిన పని, ఒక బ్లాగ్ ని క్రియేట్ చేసుకోవడం. దీనికోసం మీకు ఒక డొమైన్ & హోస్టింగ్ కావాల్సి ఉంటుంది. వీటికి మీరు ఒక సంవత్సరానికి 4000 రూపాయాలు ఇన్వెస్ట్ చెయ్యాల్సి ఉంటుంది.

ఏంటి డబ్బులు రాకముందే మేము డబ్బులు పెట్టి స్టార్ట్ చెయ్యాలా? మేము డబ్బులు పెట్టి బ్లాగ్ స్టార్ట్ చేసాక మాకు డబ్బులు రాకుంటే ఎలా? డబ్బులు పెట్టకుండా స్టార్ట్ చేయలేమా? అంటే, అది మీ ఇష్టం..!

ఎందుకంటే అలా ఫ్రీ గ స్టార్ట్ చేసిన బ్లాగ్స్ ద్వారా డబ్బులు రావడం చాలా చాలా కష్టం.

బ్లాగింగ్ అనేది ఒక Low ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ దానికి కూడా మీరు ఆలోచిస్తే మీరు ఆన్లైన్ ద్వారా మనీ సంపాదించడం కష్టం.

ఒకవేళ మీకు బ్లాగ్ ఎలా క్రియేట్ చెయ్యాలి అని మీకు తెలువకపోతే నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్ లో ఒక డిటైల్డ్ వీడియో చెయ్యడం జరిగింది మీరు ఆ వీడియో లో చెప్పిన స్టెప్స్ ని ఫాలో అయి జస్ట్ ఒక 30 నిమిషాల్లో మీ బ్లాగ్ ని క్రియేట్ చేసుకోవచ్చు.

లేదా నేను పెట్టిన ఈ పోస్ట్ నీ చదవండి. Read Now

మీకు బ్లాగ్ ఎలా create చెయ్యాలి అని తెలియక పోయిన, లేదా బ్లాగింగ్ పైన ఇంక ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మీరు నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చెయ్యచ్చు, నేను మీకు హెల్ప్ చెయ్యడానికి రెడీ గా ఉన్నాను.

FAQ’s

Blog start చెయ్యాలి అంటే money కావాలా?

Yes, ఒక మంచి blog ని మొదలు పెట్టాలి అంటే money అవసరం. దానికోసం మీకు ఒక సంవత్సరానికి 3000 నుండి 5000 వేల రూపాయల ఖర్చు అవుతుంది.

Kiran Samileti

About the author

My Name is Kiran, I am doing an IT job full-time and doing Blogging, Youtuber, and affiliate Marketing part-time to make my ways to build passive income streams.

1 thought on “2021 లో నేను ఆన్లైన్ ద్వారా ఎంత సంపాదించాను?ఎలా సంపాదించాను?”

Leave a Comment