గూగుల్ నుండి మంచి ట్రాఫిక్ ని తెచ్చుకోండిలా

హాయ్ ఫ్రెండ్స్, నమస్తే..!

ఈ పోస్ట్ ద్వారా నేను మీకు, మన బ్లాగ్ కి గూగుల్ నుండి మంచి ట్రాఫిక్ ని ఎలా పొందవచ్చు అని చెప్తాను.

నేను Octber 2021 లో ఒక బ్లాగ్ ని స్టార్ట్ చెయ్యడం జరిగింది, ఇప్పుడు ఆ బ్లాగ్ కి రోజుకి 15,000 – 20,000 మంది వస్తున్నారు.

అయితే అసలు నాకు 3 నెలల్లోనే ఇంత ట్రాఫిక్ ఎలా వస్తుంది, మీ బ్లాగ్ కి కూడా ఇంత ట్రాఫిక్ రావాలి అంటే ఎం చెయ్యాలి అనే సీక్రెట్స్ ని ఈ పోస్ట్ ద్వారా మీకు చెప్తాను .

కీవర్డ్స రీసెర్చ్ (Secret No 1)

నేను నా పాత పోస్ట్స్ లో చెప్పినట్టుగానే , ఒక బ్లాగ్ విజవంతం అవ్వడానికి Keyword Research చాలా చాలా అవసరం. కీవర్డ్ రీసెర్చ్ చెయ్యకుండా ఒక బ్లాగ్ ని స్టార్ట్ చెయ్యడం వాళ్ళ మన బ్లాగ్ కి ట్రాప్ఫిక్ రాదు. కాబట్టి మీరు ఏదైనా ఒక బ్లాగ్ కి మొదలుపెట్టే ముందు, సరైన విధంగా Keyword Research చేసిన తరువాత మాత్రమే ఒక బ్లాగ్ ని మొదలు పెట్టడం మంచింది.

మీరు ఏదైనా ఒక కీవర్డ్ ని ఎంచుకునే టప్పుడు ఆ కీవర్డ్ కి ఒక నెలలో ఎన్ని searches ఉన్నాయో అని చుడండి. తక్కువలో తక్కువ నెలకు 1000 – 5000 searches కంటే ఎక్కువగా ఉండే కీవర్డ్స్ ని మాత్రమే select చేసుకోండి.

అలాగే ఆ కీవర్డ్ ని గూగుల్ లో సెర్చ్ చేసినప్పుడు ఎలాంటి బ్లాగ్స్/వెబ్సైట్లు రాంక్ అవుతున్నాయో పరిశీలించండి. ఒకవేళ మీరు ఎంచుకున్న కీవర్డ్ కి పెద్ద పెద్ద వెబ్సైట్లు(DA > 30) రాంక్ అవుతున్నట్లైతే మీరు ఆ కీవర్డ్ ని వదిలేసి వేరే కీవర్డ్స్ కోసం వేటని కొనసాగించండి.

కీవర్డ్స్ రీసెర్చ్ ఎలా చెయ్యాలో తెలుసుకోవడం కోసం ఈ ఆర్టికల్ ని చదవండి.

యూసర్ ని ఎక్కువ సేపు మీ బ్లాగ్ లో ఉండేలా చుడండి

ఇందుకోసం మీరు కింద సూచించిన పాయింట్స్ ని పాటించండి.

User కి కావాల్సింది అందించండి

మీ బ్లాగ్ కి వచ్చే యూసర్ కి కావాల్సింది అందించండి. ఒకవేళ మీరు యూసర్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే, ఆ యూసర్ మీ బ్లాగ్ లో ఎక్కువ సేపు గడపరు, కాబట్టి మీ బ్లాగ్ కి వచ్చే యూసర్ ని ఎక్కువ సేపు మీ బ్లాగ్ లో ఉండేలా చూసుకోవడం ఎంతో ముఖ్యం. అందుకోసం మీరు మంచి కంటెంట్ ని రాయవలసి ఉంటుంది.

పేజీ లోడింగ్ స్పీడ్ పెంచుకోండి

ఒకవేళ మీ బ్లాగ్ యొక్క లోడింగ్ స్పీడ్ తక్కువగా ఉంటె మాత్రం మొదటగా google మీ బ్లాగ్ ని రాంక్ చెయ్యడానికి ఇష్టపడదు. ఒకవేళ మీ బ్లాగ్ రాంక్ అయినా కూడా మీ బ్లాగ్ పైన క్లిక్ చేసిన విజిటర్ బ్యాక్ వెళ్లి వేరే బ్లాగ్ కి వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీ బ్లాగ్ యొక్క లోడింగ్ స్పీడ్ చాలా ముఖ్యం.

ఇందుకోసం కోసం మీకు ఒక మంచి Hosting తప్పకుండ అవసరం. నేను గత రెండు సంవత్సరాలుగా BlueHost hosting ని వాడుతున్నాను. BlueHost వాళ్ళ servers మన India లోనే ఉన్నందున మన సైట్ లోడింగ్ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది.

ఒకవేళ మీరు కూడా ఒక మంచి Hosting గురించి చూస్తున్నట్లైతే మీకు BlueHost ఒక Best Choice గా నిలుస్తుంది.

User Interface

మీ బ్లాగ్ యొక్క యూసర్ ఇంటర్ఫేస్ ని సింపుల్ గా అందరికి అర్ధం అయ్యేలా ఉంచండి. దీనికోసం మీరు internal linking చెయ్యండి. ఇలా చెయ్యడం ద్వారా user మీ బ్లాగ్ లో ఉండే ఇతర పోస్ట్స్ లని కూడా విసిట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ బ్లాగ్ లో ఎక్కువగా యాడ్స్ ని పెట్టకండి, ఎక్కువ యాడ్స్ ఉండడం వాళ్ళ user confuse అయ్యి మీ బ్లాగ్ నుండి వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువగా ఉండడం తో పాటు పేజీ లోడింగ్ స్పీడ్ కూడా తగ్గుతుంది.

ఆన్-పేజీ సేవ్ (On-Page SEO)

మీరు కంటెంట్ మొత్తం రాసిన తరువాత మీ పోస్ట్ కి On-Page SEO ని సరిగా చెయ్యండి, On-Page SEO సరిగా చేస్తే చాలు మీ బ్లాగ్ గూగుల్ లో రాంక్ ఆయె అవకాశాలు 50% కంటే ఎక్కువగా ఉంటాయి.

దీనికోసం మీరు Rankmath అనే SEO Plugin ని వాడవచ్చు.

మీ బ్లాగ్ లో కొన్ని పోస్ట్స్ లు పెట్టిన తరువత మీరు మీ బ్లాగ్ కి backlinks ఇవ్వడం మొదలు పెట్టండి. బాక్లింక్స్ ఇవ్వడం ద్వారా మీ బ్లాగ్ గూగుల్ లో త్వరగా Index అవ్వడం తో పాటు మీ బ్లాగ్ పోస్ట్లు రాంక్ అవ్వడానికి దోహదపడుతాయి.

చివరగా

మన బ్లాగ్ కి ట్రాఫిక్ ఒక్క రోజులోనో లేదా ఒక నెలలోనో ఆమాంతం పెరిగిపోదు, అలాగే మీరు మొదలు పెట్టిన మొదటి బ్లాగ్ తోనే మీరు సక్సెస్ కాలేకపోవచ్చు.

మీ మొదటి బ్లాగ్ లో చేసిన తప్పుల నుండి నేర్చుకొని 2 వ బ్లాగ్ ని స్టార్ట్ చెయ్యండి ఆది కూడా సక్సెస్ అవ్వకపోతే మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో తెలుసుకోండి మల్లి ఆ తప్పుని చెయ్యకుండా ఉండండి.

గూగుల్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త updates ని రిలీజ్ చేసుతూనే ఉంటుంది కాబట్టి మనం కూడా గూగుల్ కి తగ్గ విధంగా అప్డేట్ అవుతూ ఉండాలి. లేకపోతే మన బ్లాగ్ కి ఎక్కువ రోజులు ట్రాఫిక్ ఉండకపోవచ్చు.

ఇలాంటి మరిన్ని updates కోసం మీ Name & Email ఇచ్చి మన బ్లాగ్ కి subscribe చేసుకోండి.

Kiran Samileti

About the author

My Name is Kiran, I am doing an IT job full-time and doing Blogging, Youtuber, and affiliate Marketing part-time to make my ways to build passive income streams.

7 thoughts on “గూగుల్ నుండి మంచి ట్రాఫిక్ ని తెచ్చుకోండిలా”

Leave a Comment