What is Google Question Hub? How to use it and what are the benefits of Google Question Hub?

హాయ్ ఫ్రెండ్స్ డిజిటల్ కిరణ్ బ్లాగ్ కి స్వాగతం..! ఈ ఆర్టికల్ మనం Google Question Hub in Telugu అంటే ఏంటి, దీని వాళ్ళ మనకు ఉపయోగాలు ఎం ఉన్నాయ్ అనేది తెలుసుకుందాం. కాబ్బటి పూర్తిగా తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదవండి .

నాకు తెలిసి ఈ రోజుల్లో గూగుల్ గురించి తెలియని వాళ్ళు లేరు, ఇంటర్నెట్ వాడే ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒక్కసారైనా గూగుల్ ని ఉపయోగించి ఉంటారు.

గూగుల్ క్యూస్షన్ హబ్ అంటే ఏంటి ?

Google Question Hub అనేది ఒక ఆన్లైన్ టూల్, దీన్ని గూగుల్ ముఖ్యంగా బ్లాగర్స్ లేదా కంటెన్ట్ రైటర్స్ గురించి ప్రవేశ పెట్టింది .

అసలు దీన్ని ప్రవేశ పెట్టడానికి గల కారణం ఏంటి ? నేను పైన చెప్పిన విధంగా ఏది ముక్యంగా బ్లాగర్స్ గురించి తయారు చేయబడింది . అంటే ఇంటర్నెట్ లో సమాధానం దొరకని క్యూస్షన్స్ ని గూగుల్ బ్లాగర్స్ ముందు ఉంచడానికి దీన్ని ప్రవేశపెట్టింది.

ఉదాహరణకు మీరు గూగుల్ లో సెర్చ్ చేసిన క్యూస్షన్ కి ఇంటర్నెట్ లో గనుక ఆన్సర్ లేక పోయినట్లయితే. ఆ క్యూషన్ ని గూగుల్ క్యూస్షన్ హబ్ లో ఉంచుతుంది, అప్పుడు ఆ క్యూస్షన్ చుసిన బ్లాగర్స్ దానికి సరైన సమాధానాన్ని రాస్తారు.
అంతే కాకుండా గూగుల్ క్యూస్షన్ హబ్ ముఖ్యంగా ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యతను ఇస్తుంది, ఎందుకంటే మీఅందరికి తెలుసు జిఓ వచ్చిన తరువాత మన ఇండియా లో ఇంటర్నెట్ వినియోగం ఎంతగా పెరిగిందో .

అందువల్ల చాలా మంది తమ తమ సందేహాలను ప్రాంతీయ భాషల్లోనే వెతుకుతున్నారు , కానీ ఇంటర్నెట్ లో ఉన్న 99% డేటా మొత్తం english లోనే ఉంది . కావున ప్రాంతీయ భాషల్లో కూడా సమాధానాలు పొందడానికి గూగుల్ దీన్ని ప్రవేశ పెట్టింది అని చెప్పుకోవచ్చు.

గూగుల్ క్యూస్షన్ హబ్ ఇంకా పూర్తిగా డెవలప్ కాకపోయినందున ఇది ఇంకా బీటా ప్రోగ్రాం లోనే ఉంది. ఇప్పటివరకు గూగుల్ ఇందులో చాలా ఫీచర్స్ ని add చేసినప్పటికీ ఇంకా కొత్త కొత్త ఫీచర్స్ ని add చేస్తూ వస్తుంది.

Google Question Hub ఎలా పనిచేస్తుంది ?

నాకు తెలిసి మీకు Google Question Hub గురించి కొంత అర్ధం అయిందనే అనుకుంటున్నాను . ఇప్పుడు ఏది ఎలా పని చేస్తుంది అని తెలుసుకుందాం .

గూగుల్ ప్రకారం గూగుల్ క్యూస్షన్స్ హబ్ నుండి చాలా మంది బ్లాగర్స్ ఇంటర్నెట్ లో లేని క్కులేషన్స్ కి సమాధానాలు అందిస్తూ గూగుల్ కి సహాయం చెయ్యడమే కాకుండా తమ పోస్ట్స్ ని ఈజీ గా రాంక్ చేసుకో గలుగుతున్నారు .

మీరు ఎప్పుడైనా గూగుల్ లో ఏదైనా ఆన్సర్ దొరకని క్యూస్షన్స్ ని వెతికినట్లైతే , మీరు ఒక feedback ఫారం ని చూసే ఉంటారు , అక్కడ మీరు create చేసిన క్యూస్షన్ direct గ google question hub లోకి add అయిపోతుంది. ఆ తరువాత గూగుల్ ఇలా వచ్చిన questions ని వివిధ categories లా divide చేసి, ఆ తరువాత ఆ క్యూస్షన్ ని సంబంధిత కీవర్డ్స్ కి జత చేస్తుంది.

How to create a Google Question Hub Account?

ఇందులో అకౌంట్ create చేసుకోవడం చాల చాల సులభం, ఇందుకోసం మీకు ఒక గూగుల్ అకౌంట్ తో పటు మీకు ఒక బ్లాగ్ ఉంటె చాలు. ఒకవేళ మీరు ఇందులో ఒక అకౌంట్ ని తెరుచుకోవాలి అనుకుంటే ఈ లింక్ పైన క్లిక్ చేసి కింద ఇచ్చిన చిన్న చిన్న steps ని ఫాలో అవ్వండి.

Step 1: Launch Question Hub పైన క్లిక్ చెయ్యండి

Google Question Hub in Telugu

Step 2: మీ గూగుల్ అకౌంట్ ని select చేసుకోండి

Google Question Hub Telugu

Step 3: మీ బ్లాగ్ ని select చేసుకోండి.

Google Question Hub

How to use google question hub ?

గూగుల్ క్యూస్షన్ హబ్ ని వాడడం చాలా సులభం, మీరు అందులోకి లాగిన్ ఐన తరువాత పైన ఉన్న సెర్చ్ బార్ లో మీకు నచ్చిన ఏదైనా ఒక టాపిక్ గురించి search చెయ్యాలి. ఆ తరువాత గూగుల్ మనకు ఆ టాపిక్ సంబంధించిన కొన్ని questions ని చూపిస్తుంది. అందులో నుండి మీకు తెలిసిన దానికి మీరు ఆన్సర్ రాయవచ్చు అంతే కనకుండా మీ బ్లాగ్ లో ఉన్న related article లింక్ కూడా ఇచ్చుకోవచ్చు.

అంతే కాకుండా ఒక వేళా మీకు ఏమైనా సందేహాలు ఉంటె మీ ప్రశ్నలను కూడా అక్కడ జత చెయ్యచ్చు.

Google Question Hub ఉపయోగాలు ఏంటి ?

ఇప్పటి వరకు మీకు గూగుల్ క్యూస్షన్ హబ్ గురించి మీకు పూర్తిగా అర్ధం అయింది అనుకుంటున్నాను . కానీ అసలు దీని వాళ్ళ మనకు ఉపయోగం ఏంటి? గూగుల్ ఏదైనా ఒకటి తీసుకువచ్చింది అంటే అది ఎవరికో ఒకరికి ఏదో విధంగా ఉపయోగపడేదయ్యే ఉంటుంది.

Getting New Content Ideas

పైన చెప్పుకున్న విధంగా ఇందులో చాలా మంది వాళ్లకు సంబంధించిన questions ని అడుగుతారు కాబట్టి మీరు ఈ questions ని తీసుకొని మీరు మీ బ్లాగ్ లో పోస్ట్ రాసుకోవచ్చు.

Get Traffic to Your Blog

ఇందులో ఏదైనా ఒక క్యూస్షన్ కి ఆన్సర్ రాసి మీ బ్లాగ్ లింక్ ఇచ్చుకోవచ్చు, కావున మీ బ్లాగ్ కి ఇక్కడి నుండి ట్రాఫిక్ కూడా వస్తుంది.

Kiran Samileti

About the author

My Name is Kiran, I am doing an IT job full-time and doing Blogging, Youtuber, and affiliate Marketing part-time to make my ways to build passive income streams.