How to create a blog in Telegu: ఉచితంగా బ్లాగ్ ని చేసుకునే సదుపాయాన్ని కల్పించే చాలా ప్లాటుఫామ్లు ఉన్నప్పటికి నేను మాత్రం మీకు Blogger.com ని వాడమని సలహా ఇస్తాను . ఎవరైతే ఎలాంటి ఖర్చు లేకుండా బ్లాగింగ్ ని మొదలు పెడుదాం అనుకుంటున్నారో వాళ్లకు Blogger.com సరైన ప్లాట్ఫారం , ఎందుకంటే దీంట్లో మనం ఎలాంటి ఖర్చు లేకుండా ఒక సింపుల్ & ఫ్రీ బ్లాగ్ ని చేసుకొని మన బ్లాగింగ్ జర్నీ ని మొదలు పెట్టచ్చు .
అసలు Blogger.com ఏంటి?
Blogger.com గూగుల్ వాళ్లకు సంబంధించిన blogging ప్లాట్ఫారం ఇందులో మనం ఎలాంటి ఖర్చు లేకుండా ఒక సింపుల్ blog ని చేసుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు .
Blogger లో Blog ని ఎలా ప్రారంభించాలి?
- దీనికోసం మీరు బ్లాగ్స్పాట్.కం అనే వెబ్సైటు లోకి వెళ్లి మీ గూగుల్ అకౌంట్ తో లాగిన్ అవ్వాలి.
- ఆ తరువాత కింద ఉన్న ఫోటో లో చూపిస్తున్న విధంగా మీ పేరు ఎంటర్ చేసి కంటిన్యూ టు బ్లాగర్ పైన క్లిక్ చెయ్యండి.
- ఇప్పుడు మీ ఎడమ వైపు పైన క్రియేట్ బ్లాగ్ అని ఉంటుంది దాని పైన క్లిక్ చెయ్యండి.
- ఇప్పుడు మీ బ్లాగ్ లేదా వెబ్సైటు పేరు & వెబ్ అడ్రస్ ఎంటర్ చేసి కింద ఉన్న ఏదైనా ఒక థీమ్ ని సెలెక్ట్ చేసుకోండి.
అంతే మీ బ్లాగ్ విజయవంతం గా క్రియేట్ అయింది. ఇప్పుడు మీ బ్లాగ్ ఎలా ఉందొ చూడాలి అంటే వ్యూ యువర్ బ్లాగ్ అనే దాని పై క్లిక్ చేసి చూడచ్చు .
ఒకవేళ మీకు ఆ డిజైన్ నచ్చకుంటే మీరు నెట్ లో నుండి వేరే థీమ్స్ ని డౌన్లోడ్ చేసుకొని డిజైన్ మార్చుకోవచ్చు . దాని కోసం మీరు ఈ లింక్ పైన క్లిక్ చేసి ఒక మంచి థీమ్ ని సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసి ఓపెన్ చెయ్యండి.
అప్పుడు మీకు ఒక కోడ్ కనిపిస్తుంది, ఆ కోడ్ మొత్తాన్ని కాపీ చేసుకున్న తరువాత. బ్లాగర్ డాష్బోర్డ్ లోకి వచ్చి థీమ్ పైన క్లిక్ చేసి అక్కడ ఉన్న కోడ్ డిలీట్ చేసి, కాపీ చేసుకున్న కోడ్ ని పేస్ట్ చెయ్యండి.
కాపీ చేసుకున్న కోడ్ ని కింద చూపిన విధం గా పేస్ట్ చేసి సేవ్ చెయ్యండి.
మీరు ఆ కోడ్ ని పేస్ట్ చేసి సేవ్ చేసిన తరువాత మీ బ్లాగ్ లుక్ మీరు డౌన్లోడ్ చేసుకున్న టెంప్లేట్ లోకి మారిపోతుంది.
Watch How to Create Blog in Telugu
Blog మొదలుపెట్టిన తరువాత ఎం చెయ్యాలి?
బ్లాగ్ చేసిన తరువాత మీరు చెయ్యవలసింది , మీరు ఏదైతే రాయాలి అనుకుంటున్నారో దాన్ని రాయడమే . ఇలా మీరు రాసిన వాటికి చదవడానికి ఎవరైనా వచ్చినప్పుడు మీకు డబ్బులు వస్తాయి. బ్లాగ్ ద్వారా డబ్బులు ఎలా వస్తాయో తెలుసుకోండి.
Nice
Good opportunity for students
Money
This is the best article for how to satart a blog…thanks for sharing..keep post
I have one blog and how many post I wrote in a Singla Day for better improvement…?
Adhi Niche pai depend ayi untundhi, news aithe chala posts pettali informational aithe dailt 2 or 3, micro niche aithe its different.
very useful ,thank you
Hi, best guide for beginners. Thank you