Blogging in Telugu – Complete Beginner Guide About Blogging

తెలుగు ప్రజలకు స్వాగతం..! మీరు ఆన్లైన్ ద్వారా డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారా? లేదా మీ వ్యాపారాన్ని ఆన్లైన్ ద్వారా అభిరుద్ది చేయాలి అనుకుంటున్నారా? అయితే మీకు Blogging in Telugu ఎంత గానో ఉపయోగపడుతుంది.

ఈ ఆర్టికల్ లో నేను మీకు బ్లాగింగ్ అంటే ఏంటి, బ్లాగింగ్ ద్వారా ఉండే లాభాలేంటి, ఎవరు దీన్ని స్టార్ట్ చేయవచ్చు అనే పూర్తి వివరాలను మీకు అందిస్తాను, కాబట్టి ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదవండి

What is Blogging in Telugu

అర్ధం అయ్యేలా సింపుల్ గా చెప్పాలి అంటే, మనకు తెలిసిన విషయాలను ఇంటర్నెట్ నీ ఉపయోగించి Blog లేదా వెబ్సైట్ ద్వారా అవసరం ఉన్నవాళ్లకు తెలియజేయడాన్ని బ్లాగింగ్ అంటారు.

ఉదాహరణకు కొత్తగా వచ్చే సినిమాల గురించి కావచ్చు, క్రికెట్, మొబైల్స్, వంటలు, టెక్నాలజీ ఇలా దేనిపై ఐన సరే బ్లాగింగ్ చేయవచ్చు.

మీకు ఏ టాపిక్ పై అయితే మంచి పట్టు ఉంటుందో, మీరు ఆ టాపిక్ పైన ఒక బ్లాగ్ మొదలుపెట్టవచ్చు.

Blogging ఎందుకు మొదలుపెట్టాలి?

బ్లాగింగ్ ద్వారా చాలా ఉపాయోగాలు ఉన్నాయి, అందులో కొన్ని:

  1. డబ్బు – Money
    సాధారణంగా మనం ఏ పని చేసిన డబ్బు కోసమే చేస్తాం. అలాగే Blogging ద్వారా కూడా మనం డబ్బు సంపాదించవచ్చు. అలాగే ఇందులో ఉన్న ఒక మంచి విషం ఏంటి అంటే మనం నిద్రపోతున్నప్పుడు కూడా మన బ్లాగ్ ద్వారా డబ్బులు వస్తూనేఉంటాయి. (Click To See My Earning Proof)
  2. పేరు – గుర్తింపు (Fame)
    మనిషికి డబ్బు తరువాత కావాల్సింది ఒక మంచి గుర్తింపు దాన్ని మీరు బ్లాగింగ్ ద్వారా పొందవచ్చు.
  3. మనకు మనమే బాస్ (Be Your Own Boss)
    Blogging లో ఉన్న మరొక మంచి విషయం ఏంటి అంటే Freedom. మనకు నచ్చినప్పుడు, ఇష్టం ఉన్నచోట నుండి బ్లాగింగ్ చేసుకోవచ్చు . జాబ్ లాగా రోజు ఇన్ని గంటలు పని చెయ్యాలని ఏమి ఉండదు, మనకు మనమే బాస్ .
  4. చదువు తో పని లేదు ఏదైనా ఒక జాబ్ చెయ్యాలి అంటే దానికి చదువు, డిగ్రీ లు కావాలి, కానీ బ్లాగింగ్ కి ఇవ్వన్నీ అవసరం లేదు, మీకు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ వస్తే చాలు, ఒకవేల మీకు ఇవ్వి రాకపోయినా సరే మీరు ఇతరులకు డబ్బులు ఇచ్చి రాపించుకోవచ్చు.

Blogging ని ఎవరు మొదలుపెట్టవచ్చు ?

పైన చెప్పిన విధంగా దీనికి చదువు తో & వయసుతో పని లేదు, కాబట్టి దీనిని ఎవరైనా మొదలుపెట్టవచ్చు.

  • విద్యార్థులు
  • జాబ్ చేస్తున్న వాళ్ళు
  • జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు
  • వ్యవసాయం చేస్తున్న వాళ్ళు
  • ఉపాధ్యాయులు
  • వ్యాపారవేత్తలు

ఇలా ఎవరైనా సరే మొదలుపెట్టవచ్చు.

బ్లాగ్ నుండి డబ్బులు సంపాదించాలి అంటే ఎం చెయ్యాలి ?

బ్లాగ్ నుండి డబ్బులు సంపాదించటానికి చాలా విధాలు ఉన్నాయి, అందులో గూగుల్ Adsense కూడా ఒకటి.
Google Adsense వాళ్ళు మన బ్లాగ్ ని చూసి, వాళ్ళ policies కి తగ్గ విధంగా మన బ్లాగ్ ఉంది అంటే వాళ్ళు మన బ్లాగ్ ని adsense కి approve చేస్తారు.

ఇలా గనుక మీ బ్లాగ్ AdSense కి approve అయితే, మీ బ్లాగ్ లో యాడ్స్ పెట్టుకోవడం ద్వారా మీరు డబ్బులు సంపాదించవచ్చు.

బ్లాగింగ్ ద్వారా నెలకు ఎంత సంపాదించవచ్చు ?

నెలకు ఎంత సంపాదించవచ్చు అనేది మన Blog ని మనం ఏవిధంగా Monetize చేసాము, నెలకు ఎంత మంది మన Blog కి వస్తున్నారు, ఏ లొకేషన్స్ నుండి వస్తున్నారు అలాగే మనం ఏ కంటెంట్ పెడుతున్నాము అనే విషయాల పైన ఆధారపడి ఉంటుంది.

అందుకే బ్లాగింగ్ లో నెలకు ఇంత వస్తాయి అని సరిగా చెప్పలేము, ఒక్కోసారి ఎక్కువ వస్తాయి ఒక్కోసారి తక్కువగా వస్తాయి. కానీ డబ్బులు మాత్త్రం పక్కాగా వస్తాయి. (Click To See My Earning Proof).

Adsense Earning Proof
Adsense Proof

How to Get Traffic to a Telugu Blog?

మన బ్లాగ్ కి ట్రాఫిక్ రావాలి అంటే చాలా విధాలు ఉన్నాయి. కానీ, అందులో అతి ముఖ్యమైంది SEO (Search Engine Optimization) మనం మన బ్లాగ్ కి SEO చెయ్యడం ద్వారా google నుండి organic traffic ని పొందవచ్చు . లేదా మీకు మంచి followers ఉన్న facebook పేజీ, Telegram ఛానల్, YouTube ఛానల్ ఉన్నాకూడా మీరు అక్కడి నుండి మీ బ్లాగ్ కి ట్రాఫిక్ తెపించుకోవచ్చు .

సాధారణంగా వచ్చే ప్రశ్నలు (FAQ’s)

బ్లాగింగ్ ని వృతిగ్గ మార్చుకోవచ్చా ?

అవును, మీ బ్లాగ్ నుండి గనుక మీకు మంచి సంపాదన వస్తుంది అంటే మీరు దీన్ని వృతిగ మార్చుకోవచ్చు. కానీ బ్లాగ్ ద్వారా మంచి డబ్బులు రావాలి అంటే కొత్త సమయం పట్టుద్ది. కాబట్టి మీరు బ్లాగింగ్ ని మొదట్లో పార్ట్ టైం గా మొదలుపెట్టి, మంచి డబ్బులు వాస్తే ఫుల్ టైం గా చేసుకోవాచ్చు .

వాయిస్ టు టెక్స్ట్ కన్వెర్ట్ చేయవచ్చా ?

అవును, మీరు వాయిస్ టు టెక్స్ట్ కన్వెర్ట్ చేసి పెట్టవచ్చు , ఎలాంటి ఇబ్బంది ఉండదు.

వేరే వెబ్సైట్ల నుండి కాపీ కొట్టవచ్చా ?

లేదు , మీరు వేరే వెబ్సైట్లు లో ఉన్న కంటెంట్ ని కాపీ చేయకూడదు. కావాలి అంటే దాన్ని అర్ధం చేసుకొని మీకు అర్ధం ఐన విధం గా రాసుకోవచ్చు

Blog స్టార్ట్ చెయ్యాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది?

ఒకవేళ మీరు పూర్తిగా Blogger లో కనుక మొదలుపెడితే, మీకు ఎలాంటి ఖర్చు ఉండదు. కానీ మీకు Custom Domain కావలి అంటే మాత్రం మీరు ఒక 500 రూపాయలు ఖర్చు చేయవలిసి వస్తుంది. (మీరు మీ డొమైన్ ని GoDaddy నుండి కొనుకోవచ్చు)

ఒకవేళ మీకు మంచి professional website or blog కావాలి అనుకుంటే మీరు WordPress ని ఎంచుకోవచ్చు, దీని కోసం మీకు ఒక 3000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది.

బ్లాగింగ్ స్టార్ట్ చెయ్యాలి అంటే ఎం ఎం కావలి ?

దీని కోసం మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ఒక ఫోన్, లాప్టాప్ లేదా కంప్యూటర్ ఉంటె చాలు. ఫోన్ లో బ్లాగింగ్ చెయ్యడం కొంచం కష్టంగానే ఉంటుంది కానీ అసాధ్యం కాదు. ఒకవేళ లాప్టాప్ లేదా కంప్యూటర్ ఉంటె ఇంకా మంచిది.

Blogging in Teluguతెలుగు లో రాయవచ్చా?

అవును, మీరు బ్లాగింగ్ తెలుగు లో కూడా చేయవచ్చు. ఇప్పుడు నేను చేస్తుంది కూడా అదే.

Strat Your Blog Now

Kiran Samileti

About the author

My Name is Kiran, I am doing an IT job full-time and doing Blogging, Youtuber, and affiliate Marketing part-time to make my ways to build passive income streams.

9 thoughts on “Blogging in Telugu – Complete Beginner Guide About Blogging”

    • నేను ఒక ప్రైవేట్ టీచర్ గా పని చేస్తున్నాను నేను తెలుగు సోషల్ సైన్స్ క్లాసెస్ చాలా బాగా చెప్పగలను అదేవిధంగా తెలుగుని తప్పులు లేకుండా చక్కగా టైపింగ్ చేయగలను

      స్పందించు

Leave a Comment