బ్లాగ్ ద్వారా మనం ఎన్ని విధాలుగా సంపాదించవచ్చు ?

ఒకవేళ మీరు నా పాత ఆర్టికల్స్ కనుక చదివినట్టయితే మీకు బ్లాగ్ మరియు బ్లాగింగ్ అంటే ఏంటో తెలిసే ఉంటుంది. ఒకవేళ మీరు ఆ ఆర్టికల్స్ ని చదవకుంటే ఇక్కడ క్లిక్ చేసి వాటిని చదివాక ఇది చదవండి అప్పుడు మీకు ఇంకా బాగా అర్ధం అవుతుంది.

ఒక వేళా మీరు వాటిని ముందే చదివి ఉంటె మనం మన బ్లాగ్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు అని మీకు తెలిసే ఉంటుంది, కానీ ఈ ఆర్టికల్ ద్వారా నేను మీకు మన ద్వారా మనం ఎన్ని విధాలుగా డబ్బులు సంపాదించవచ్చు అని వివరిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం పదండి మొదలు పెడుదాం.

Google Adsense

మీలో చాలా మందికి గూగుల్ adsense గురించి తెలిసే ఉంటుంది. ఇది మన బ్లాగ్ ద్వారా డబ్బులు సంపాదించటానికి ఒక మంచి మార్గం అని చెప్పుకోవచ్చు. ఒక వేళా మీ బ్లాగ్ కి మంచి ట్రాఫిక్ గనుక ఉన్నట్లయితే మీరు గూగుల్ adsense ద్వారా మంచి డబ్బులు సంపాదించవచ్చు. చాలా మంది బ్లాగర్స్ దీన్ని ఉపయోగించుకొని కొన్ని వేయిల నుడి లక్షల్లో కూడా సంపాదిస్తున్నారు.

మీరు మీ బ్లాగ్ లో మంచి కంటెంట్ ఉన్న పోస్ట్లు ఒక 15 నుండి 20 రాసిన తరువాత మీరు Adsense కి గనుక అప్లై చేసినట్టయితే . వాళ్ళు మీ బ్లాగ్ ని రివ్యూ చేసి 1 లేదా 2 వారాల్లో మీకు మెయిల్ పంపిస్తారు. ఒకవేళ మీ సైట్ కనుక approve అవుతే మీరు మీ బ్లాగ్ లో ads ని display చెయ్యవచ్చు .

అధేవిధం గా ఒకవేళ రిజెక్ట్ ఐన కూడా మీరు మల్లి కొన్ని మార్పులు చేసి reapply కూడా చేయవచ్చు .

Affiliate Marketing

Affiliate మార్కెటింగ్ ద్వారా కూడా మనం చాలా డబ్బులు సంపాదించవచ్చు , కానీ ఇందులో మీరు సక్సెస్ అవ్వాలి అంటే మాత్రం మీరు కేవలం కొనేవాళ్లను మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఆర్టికల్స్ రాయాలి.

అంటే ఉదాహరణకు మీరు ఒక మూవీ రివ్యూ రాసి affiliate లింక్ ఇస్తే ఎవ్వరు కొనరు, ఇలా వెయ్యి మంది వచ్చిన సరే ఒక్కరు కూడా మీ లింక్ పై క్లిక్ చేసి ఆ వస్తువుని కొనరు. ఎందుకంటే వాళ్లకు కావాల్సింది ఆ వస్తువు కాదు, ఆ మూవీ రివ్యూ.

కానీ మీరు ఒక వాషింగ్ మెషిన్ పైన పోస్ట్ రాస్తే మీ బ్లాగ్ కి వచ్చిన 10 మందిలో ఒక్కరైనా సరే ఆ లింక్ పైన క్లిక్ చేసి ఆ వస్తువుని కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. affiliate మార్కెటింగ్ ద్వారా మీ బ్లాగ్ కి తక్కువ మంది visitors వచ్చిన సరే మీకు మంచి income వస్తుంది.

Also Check: 2021 లో నేను ఆన్లైన్ ద్వారా ఎంత సంపాదించాను?

Affiliate Program లో ఎలా join అవ్వాలి?

ఒక వేళా మీ niche కి సంబంధించిన ప్రొడక్ట్స్ అమెజాన్ లో ఉన్నటైతే మీరు అమెజాన్ affiliate ప్రోగ్రాం లో జాయిన్ అయి మీరు మీ affiliate లింక్ తో ఆ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించవచ్చు. అమెజాన్ affiliate కమిషన్స్ కి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ఒకవేళ మీ ప్రోడక్ట్ అమెజాన్ లో లేకున్నా లేదా అమెజాన్ వాళ్ళు ఇచ్చే కమిషన్ కన్నా ఎక్కువ కావలి అనుకుంటే. గూగుల్ లోకి వెళ్లి మీరు ప్రమోట్ చేసే ప్రోడక్ట్ పక్కన affiliate ప్రోగ్రాం అని టైపు చేసి search చెయ్యండి. అప్పుడు మీకు ఆ ప్రోడక్ట్ కి సంబంచిందినా affiliate networks వస్తాయి అందులో జాయిన్ అయి ఆ లింక్ తో ప్రోడక్ట్ ని ప్రమోట్ చెయ్యండి.

Best Affiliate Networks

మీరు పైన ఇచ్చిన affiliate ప్రోగ్రామ్స్ లో జాయిన్ అయి కూడా మీకు నచ్చిన ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చెయ్యచ్చు

Selling Own Products (సొంత వస్తువులను అమ్మడం ద్వారా )

ఇది కూడా కొంచం affiliate మార్కెటింగ్ లాంటిదీ కానీ ఇందులో మీరు మీ సొంత వస్తువులను అమ్ముతారు . పైన చెప్పిన విధం గ మీరు మీ సొంత వస్తువులను అమ్మాలి అన్నకూడా మీరు కొనేవాళ్లను టార్గెట్ చెయ్యాలి . అలాంటప్పుడు మాత్రమే మీకు మంచి revenue వస్తుంది. కానీ ఇది అందరికి set అవ్వదు, ఎందుకంటే అందరి దగ్గర products ఉండవు కాబట్టి .

Selling Guest Post or Links

ఇది మీకు వినడానికి కొంచం కొత్తగానే ఉంటుంది, కానీ మీకు తెలుసా కొందరు bloggers లేదా website owners ఇలా కూడా డబ్బులు సంపాదిస్తారు. మీ అందరికి backlinks అంటే ఏంటో ? అవ్వి ఎంత important అనేది మీకు తెలిసే ఉంటుంది, అందుకనే చాల మంది పెద్ద పెద్ద blogs(Popular Blogs ) లేదా high డొమైన్ రేటింగ్ ఉన్న website నుండి backlinks సంపాదించుకోవడం కోసం వాళ్లకు డబ్బులు కడుతారు . ఒకవేళ మీ బ్లాగ్ కి కూడా మంచి డొమైన్ రేటింగ్ ఉంటె మీకు కూడా ఇలా డబ్బులు charge చెయ్యవచ్చు .

Paid Promotions or banners

ఒకవేళ మీ బ్లాగ్ కి మంచి traffic వస్తే మీకు పైడ్ promotions లేదా sponserships కూడా వస్తాయి , అదే విధం గా మీరు మీ బ్లాగ్ లో ఒక advertise చేసి కూడా డబ్బులు సంపాదించవచ్చు . కానీ ఈ విధం గా సంపాదించాలి అంటే మన బ్లాగ్ కి మంచి ట్రాఫిక్ తో పాటు మంచి పేరు కూడా ఉండాలి. ఆలా ఉన్నపుడు మాత్రమే ఈ విధంగా సంపాదించడానికి వీలుంటుంది.

పైన చెప్పిన వాటిలో మీకు ఏది suite అవుతుందో దాన్ని మీ Main Monetisation పద్దతిగా వెంచుకోండి .

Kiran Samileti

About the author

My Name is Kiran, I am doing an IT job full-time and doing Blogging, Youtuber, and affiliate Marketing part-time to make my ways to build passive income streams.