Domain Name ఎందుకు ముక్యమైందో తెలుసుకోండి

నమస్తే ఫ్రెండ్స్.!
ఈ ఆర్టికల్ ద్వారా నేను మీతో డొమైన్ నేమ్ అంటే ఏంటి? డొమైన్ నేమ్ ఎందుకు important అనే విషయం పైన చర్చిస్తాను.

డొమైన్ నేమ్ అంటే ఏంటి?

ఒకవేళ మీరు ఒక బ్లాగ్ ని స్టార్ట్ చేసి ఉంటే మీరు డొమైన్ నేమ్ అనే పదం వినే ఉంటారు. సింపుల్ గా మరియు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే డొమైన్ నేమ్ నీ మన వెబ్ సైట్ యొక్క పేరు లేదా యు ఆర్ ఎల్ అని చెప్పుకోవచ్చు.

సాధారణంగా కంప్యూటర్స్ ఒక వెబ్ సైట్ ని గుర్తించడానికి IP అడ్రస్ ని వాడుకుంటాయి. కానీ మనుషులకి IP అడ్రస్ (11.150.56.54) గుర్తించుకోవడం కష్టమైన పని అందుకే మనుషులకి అర్థమయ్యేలా ఉండాలి అని ఈ డొమైన్ నేమ్ ప్రవేశపెట్టారు.

ఇంటర్నెట్ లో ఉన్న ప్రతి ఒక్క వెబ్ సైట్ కి ఒక డొమైన్ నేమ్ అనేది ఉంటుంది అలాగే ఏ 2 వెబ్ సైట్ యొక్క Domain Names కూడా సేమ్ గా ఉండవు. అంటే ప్రతి ఒక వెబ్సైట్ డొమైన్ నేమ్ డిఫరెంట్ గా లేదా Uniq గా ఉంటుంది.

మీరు ఫ్రీ ప్లాట్ ఫార్మ్స్ ని యూస్ చేసుకొని ఒక బ్లాగ్ ని గనుక చేసినట్టయితే మీ డొమైన్ నేమ్ ఒక ఎక్స్టెన్షన్స్ తో రావడం జరుగుతుంది. ఉదాహరణకు మీరు బ్లాగర్ లో ఒక వెబ్ సైట్ ని లేదా బ్లాగ్ ని చేసినట్టయితే మీ బ్లాగ్ (URL) యూఆర్ఎల్ చివర్లో .blogspot.com అని వస్తుంది.

ఇలా చివర్లో ఇలాంటి ఎక్స్టెన్షన్స్ ఉండడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి.

  • యూసర్ కి మీ డొమైన్ నేమ్ ని గుర్తుపెట్టుకోవడం కష్టం గ ఉండవచ్చు .
  • Search Engines కూడా కస్టమ్ డొమైన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి .
  • డొమైన్ నేమ్ ఉండడం వాళ్ళ మీకంటూ ఒక బ్రాండ్ నేమ్ ఉంటుంది .

అందుకే మీ వెబ్సైట్ కంటూ ఒక డొమైన్ నేమ్ ఉండటం చాలా చాలా ముఖ్యం.

డొమైన్ నేమ్ ఎలా ఎంచుకోవాలి & ఎలా కొనాలి ?

మీరు ఏదైనా ఒక డొమైన్ నేమ్ వాడుకోవాలి అంటే ముందుగా దాన్ని రిజిస్టర్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక డొమైన్ నేమ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనేది చూద్దాం.

డొమైన్ నేమ్ ఎలా ఎంచుకోవాలి ?

మీరు డొమైన్ నేమ్ ఎంచుకునేటప్పుడు అందులో కేవలం లెటర్స్ మాత్రమే ఉండేలా చూసుకోండి అలాగే మీ డొమైన్ నేమ్ సింపుల్ గా చిన్నగా మరియు ఏదైనా ఒక అర్థం వచ్చేలా ఉండేటట్లు చూసుకోండి. డొమైన్ నేమ్ లో మూడు కంటే ఎక్కువ వాట్స్ అలాగే నంబర్స్ , special characters లేకుండా ఉంటే మంచిది.

మంచి డొమైన్ నేమ్ ఉదాహరణలు:

  • www.example.com
  • www.yourname.in
  • www.mydomain.net
  • www.website.net

చేడు డొమైన్ నేమ్ ఉదాహరణలు

  • www.my-domain.club
  • www.name123.com
  • www.123-name.net

ముఖ్యం గ Top Level Domain తీసుకోవడానికి మొగ్గుచూపండి.

Top Level Domain Names కి ఉదాహరణలు:

.com, .in, .net, .org, .co.in

డొమైన్ నేమ్ ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ?

మీరు ఒక డొమైన్ నేమ్ ని ఎంచుకున్న తర్వాత అది అవైలబుల్ గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే మీలాగే చాలామంది ఆలోచించి ఇదివరకే ఎవరో ఒకరు ఆ డొమైన్ ని రిజిస్టర్ చేసుకొని ఉండవచ్చు. అందుకని మనం కేవలం అందుబాటులో ఉన్న Domains ని మాత్రమే మన పేరు పైన రిజిస్టర్ చేసుకోవచ్చు.

మీరు వెతుకుతున్న డొమైన్ అందుబాటులో ఉందొ లేదో తెలుసుకోవడానికి అలాగే డొమైన్ నేమ్ suggestions ఇవ్వడానికి ఈ వెబ్సైటు మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

Domain Name Buying Telugu

ఇలా ఒక అవైలబ్లె డొమైన్ నేమ్ ని ఎంచుకున్న తరువాత మీరు ఆ డొమైన్ ని మీ పేరుపై రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇలా రిజిస్టర్ చేసుకోవడానికి ఇంటర్నెట్లో చాలా వెబ్సైట్లు ఉన్నాయి అందులో GoDaddy, BigRock, NameCheap వంటి వెబ్ సైట్ లు కొద్దిగా ఫేమస్.

Kiran Samileti

About the author

My Name is Kiran, I am doing an IT job full-time and doing Blogging, Youtuber, and affiliate Marketing part-time to make my ways to build passive income streams.