What Is Digital Marketing in Telugu – డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి?

Digital Marketing in Telugu: ఈరోజు నేను మీకు అసలు Digital Marketing అంటే ఏంటి? దీని ద్వారా మనం ఎలా డబ్బులు సంపాదించవచ్చు? ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? దీని ద్వారా మీరు మీ బిజినెస్ ని ఎలా పెంచుకోవచ్చు? ఇలా డిజిటల్ మార్కెటింగ్ గురించి ఇంకా మరెన్నో పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు

డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి?

మీ అందరికీ మార్కెటింగ్ అంటే ఏంటో తెలిసే ఉంటుంది అని అనుకుంటున్నాను, ఒకవేళ మీకు Marketing అంటే ఏంటో తెలియక పోతే అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలి అంటే. ఏదైనా ఒక ప్రోడక్ట్ ని లేదా సర్వీస్ ని ప్రజలకు తెలియజేయడం లేదా ప్రజల్లోకి తీసుకు వెళ్ళడాన్ని మార్కెటింగ్ అంటారు.

మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా మార్కెటింగ్ లో కూడా చాలా మార్పులు వచ్చాయి. మొదట్లో ఇంటింటికి వెళ్లి మార్కెటింగ్ చేస్తే, ఆ తరువాత, రేడియో, టీవీ, న్యూస్ పేపర్ల ద్వారా మార్కెటింగ్ చేస్తున్నారు.

కానీ ఇప్పుడు టెక్నాలజీ ఎంత గానో పెరిగింది, అందరూ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు . అలాంటప్పుడు మార్కెటింగ్ పద్ధతులు కూడా మారాలి, అందుకనే డిజిటల్ మార్కెటింగ్ అందుబాటు లోకి వచ్చింది.

What is Digital Marketing in Telugu

ఏదైనా ఒక ప్రోడక్ట్ లేదా సర్వీస్ ను డిజిటల్ మీడియా ను వాడుకొని ప్రజల్లోకి తీసుకువెళ్ళడాన్నే డిజిటల్ మార్కెటింగ్ అంటారు.

డిజిటల్ మార్కెటింగ్ చేయడం లేదా నేర్చుకోవడం ద్వారా ఉపయోగాలేంటి.?

Benefites of Digital Marketing: పైన చెప్పిన విధంగా మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా మార్కెటింగ్  విధానాలు కూడా మారుకుంటూ వచ్చాయి. ఇప్పుడు డిజిటల్ యుగం ప్రారంభం అయింది, కాబట్టి మార్కెటింగ్ విధానాలు కూడా మారుతున్నాయి అందుకని ఇప్పుడు ఉన్న ఈ ఆధునిక ప్రపంచంలో మన వ్యాపారం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే డిజిటల్ మార్కెటింగ్ ఎంతో అవసరం.

ఇతర మార్కెటింగ్ పద్ధతులతో పోలిస్తే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా చాలా లాభాలు ఉన్నాయి.

ఉదాహరణకు మనం టీవీ లో ఏదైనా ఒక ప్రకటన  వేయాలి అనుకుంటే, అది  ఏ ప్రాంతం వాళ్లకు చూపించాలి, ఏ వయసు వాళ్లకు చూపించాలి, ఎంత మందికి చూపించాలి, ఇలా చాలా విషయాలు మనం కంట్రోల్ మరియు ట్రాక్ చేయలేము .

అలాగే టీవీ లో మన యాడ్ రావాలి అంటే చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు చేయవలిసి ఉంటుంది. కానీ డిజిటల్ మర్కెటింగ్ లో ఆలా  ఉండదు.

మనం మన యాడ్ ని ఏ వయసు వాళ్ళకి కావాలి అంటే వాళ్లకు చూపించగలం. అలాగే ఏ ప్రాతం వాళ్లకు, ఏ సమయం లో , ఏ బాషా వచ్చిన వాళ్లకు చూపించాలి అని మనం కంట్రోల్ చేయవచ్చు.

మీరు మీ దగ్గర ఉన్న ఏదైనా ఒక  ప్రోడక్ట్ లేదా సర్వీస్ ని ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటే డిజిటల్ మార్కెటింగ్ ఒక మంచి మార్గం.

ఒకవేళ మీదగ్గర ఎలాంటి ప్రోడక్ట్ లేదా సర్వీస్ లేక పోయినా, మీకు డిజిటల్ అమార్కెటింగ్ చెయ్యడం వచ్చి ఉంటే, మీరు వేరేవాళ్లకు Digital Marketing చేసి కూడా డబ్బులు సంపాదించవచ్చు.

డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం ఎలా?

మీరు గనుక డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకుంటే మీకు యూట్యూబ్ లో చాలా వీడియోస్ అంధుబాటులో ఉన్నాయి. కాబట్టి మీకు ఎలాంటి ఖర్చు లేకుండా simple గా ఇంట్లో ఉండి మీరు డిజిటల్ మార్కెటింగ్ ని నేర్చుకోవచ్చు. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీకు యూట్యూబ్ లో ఉండే వీడియోస్ చూసినంత మాత్రాన డిజిటల్ మార్కెటర్ కాలేరు. కబటీ మీరు నేర్చుకున్న ధాన్ని implement చెయ్యడం ద్వారా మీరు practical knowledge ని సంపాదించుకోవచ్చు.

అందుకోసం మీరు మీ ఊరులో ఉన్న ఎధైన ఒక వ్యాపారానికి ఫ్రీ గా డిజిటల్ మార్కెటింగ్ చేయండి. ఇలా చెయ్యడం ద్వారా మీకు మంచి అనుభవం వస్తుంది. ఇలా మీకు ఒక మంచి అనుభవం వచ్చాక మీరు ఇతర వ్యాపారులను కలిసి వాళ్ళ వ్యాపారానికి డిజిటల్ మార్కెటింగ్ చేసినందుకు గాను డబ్బులు తీసుకోవచ్చు.

Kiran Samileti

About the author

My Name is Kiran, I am doing an IT job full-time and doing Blogging, Youtuber, and affiliate Marketing part-time to make my ways to build passive income streams.

Leave a Comment